కూనవరం ఎస్సై బి.వెంకటేష్ ను అభినందించిన సీఎం వైఎస్ జగన్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ఎస్సై వెంకటేష్ కి మెడల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సిఫార్సు చేశారు. హెలిపాడ్‌ నుంచి కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతున్న సందర్భంలో ఒక విజ్ఞాపనకోసం సీఎం బస్సుదిగారు. అదే సమయంలో అక్కడున్న స్థానికుల అధికారులు బాగా పనిచేశారని సీఎంకు చెప్పారు.

అదే సమయంలో స్థానిక ఎస్సై వెంకటేష్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సాహసోపేతంగా నిర్వహించారని గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలకపాత్ర పోషించారని సీఎం ఎదుట మెచ్చుకున్నారు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌ను సీఎం భుజం తట్టి, అభినందించారు. మెడల్‌ ఇవ్వాలంటూ సిఫార్సు చేశారు.

CM Jagan Congratulates to Kunavaram SI venaktesh (Photo-AP CMO/Twitter)

Here's CMO AP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)