టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంతో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. కాగా భారత్‌కు పథకం సాధించిన మీరాబాయికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ స్పందించారు. ‘అద్భుతమైన ప్రదర్శన. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారతదేశం పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించినందుకు మీరాబాయి చానుకి హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)