ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం ఢిల్లీ టూర్‌కు బయలుదేరారు. పర్యటనలో భాగంగా.. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాల ఆమోదంపై ప్రధానితో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
అంతేకాదు.. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ గ్యాప్ విడుదల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఏపీ ప్రత్యేక హోదా అంశ ప్రస్తావన మరోమారు తేవడంతో పాటు కీలక అంశాలపైనా ప్రధాని భేటీలో సీఎం జగన్ ప్రస్తావన తీసుకురానున్నారు. సాయంత్రం 4గంటల 45 నిమిషాలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారు.
నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.#CMYSJagan #NarendraModi #Delhi
— YSR Congress Party (@YSRCParty) April 5, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)