ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు.. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉంది అంటూ ఈ సందర్భంగా ఆయన యువ ఐపీఎస్‌లకు మార్గనిర్ధేశం చేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో యువ ఐపీఎస్‌లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్ళి, సునీల్ షెరాన్, రాహుల్ మీనా ఉన్నారు.
క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు. సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ మార్గనిర్ధేశం చేసి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పిన సీఎం. pic.twitter.com/a5KMQcen0l
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)