విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) మాజీ చైర్‌పర్సన్‌, తూర్పు నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకటరావు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి అధినేత నారా చంద్రబాబునాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అక్కరమాని విజయనిర్మల 2019 ఎన్నికల్లో తూర్పు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.టీడీపీలో చేరిన అనంతరం సీఎం జగన్ పై విమర్శలు చేశారు. సర్వే రిపోర్టు బాలేదని విశాఖ ఈస్ట్ లో నాకు టికెట్ ఇవ్వలేమన్నారు. మరి ఎమ్ వి వి రిపోర్టు బాగుందా? ప్యాకేజీలకు అమ్ముడుపోయేది ఎవరో తెలుసు. సీఎం జగన్ తో వేగడం చాలా కష్టమన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)