అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినీబాల వైసీపీని వీడారు. శమంతకమణి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989-91 మధ్య కాలంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో శమంతకమణి కూతురు యామినీబాలకు శింగనమల నియోజకవర్గం నుంచి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో యామినీబాల గెలుపొందారు. అయితే, 2019లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో శమంతకమణి, యామినీబాల, అశోక్ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరు... పార్టీకి గుడ్ బై చెప్పారు.  విజయవాడ వెస్ట్‌లో పవన్‌కు బిగ్‌ షాక్‌, పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్‌, ఏ పార్టీలోకి వెళతారంటే..

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)