ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు. వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..
గతంలో పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించిన ఆమంచి కృష్ణమోహన్‌కు టికెట్ దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ 2014లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు .ఆమంచి కృష్ణమోహన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Here's Amanchi Krishna Mohan Tweet
చీరాల నియోజకవర్గ శ్రేయస్సు కొరకు మరియు అత్యధిక చీరాల ప్రజల ఆకాంక్ష మేరకు వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.#Chirala #Amanchi #SaveChirala #AmanchiForChirala pic.twitter.com/Ffbp3gnFCL
— Amanchi Krishna Mohan (@AmanchiKM) April 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)