కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్‌కుమార్ రాజీనామా చేశారు. టీడీపీలో చేరిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ పాలనలో ఉత్తుత్తి సామాజిక న్యాయమే జరుగుతోంది. అక్కడ బీసీలకు పదవులు ఉంటాయి కానీ అధికారాలు ఉండవు. కర్నూలు అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరా. నగరం నుంచి వలసలు నివారించలేకపోయాననే బాధ ఉంది. తాగునీరు కూడా ఇవ్వలేకపోయా. సీఎం అపాయింట్‌మెంట్ దొరకడం కూడా కష్టమే’’ అని అన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
Here's News
Kurnool MP Dr Sanjeev Kumar who had quit @YSRCParty few days ago joined @JaiTDP in the presence of @ncbn today#Andhra #AndhraPradeshElections2024 #AndhraPradesh #AndhraPolitics pic.twitter.com/3XZbY5xTkd
— SNV Sudhir (@sudhirjourno) March 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)