ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సభా ప్రాంగణం వద్ద భూమిపూజ చేశారు. అంతకుముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. వివిధ కమిటీలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు.

చిలకలూరిపేట సభను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న టీడీపీ.. లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ, జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో లక్షలాదిమందితో విజయవంతం చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ సభకు హాజరవుతుండడంతో లోకేశ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Here's TDP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)