ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథ‌మిక సభ్య‌త్వంతో పాటు ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొంత‌కాలంగా పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు తెలిపారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని ఆయ‌న‌ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరే అంశంపై స్పష్టత ఇవ్వలేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)