చంద్రబాబు దివంగత ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారంటూ మండిపడ్డారు. ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు.

సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలి. అప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందని కొడాలి నాని అన్నారు. మంచి చేస్తేనే ఓటేయమని సీఎం జగన్‌ దమ్ముగా అడుగుతున్నారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలి. మీ కోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం రెండు బటన్‌లు నొక్కండి. ఈ సారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధించండి. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందంటూ కొడాలి అన్నారు.  నాకు ఒక కల ఉంది అంటూ వైసీపీ కొత్త నినాదం, ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభ కోసం ప్రచారం ముమ్మరం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)