ఏపీలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. రా కదలి రా పేరిట అప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తుండగా... తాజాగా భాగస్వామ్య స్ఫూర్తితో ఎలక్షన్ స్పెషల్ సాంగ్ ను నేడు విడుదల చేశారు.

"నినదించర గళం విప్పి, నిలదీయర గల్ల పట్టి... నిలవాలిర పిడికిలెత్తి... తెలుగుదేశ సైనికా...!

ప్రతి అడుగొక పిడుగులాగ... గెలుపు మోకరిల్లే దాక... ప్రతినబూని కదలి రారా... జనసేన సేవకా...!

అభివృద్ధికి అర్థమైన దార్శనికుని (చంద్రబాబు) స్ఫూర్తిగా...

రాష్ట్ర ప్రగతే ముఖ్యమన్న పవనన్నకి అండగా...

ఉడుకెత్తిన నెత్తురే ఒకనిప్పుటేరు (లోకేశ్) లాగ...

కదిలిరా... కదలిరా... కదలిరా...

పిలుస్తోంది పిలుస్తోంది తెలుగుదేశం రారా

పదం కలిపి నడుస్తోన్న జనసేనతో రారా..." అంటూ ఈ గీతం సాగుతుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)