ఏపీలో ఫలితాల గడువు సమీపిస్తున్న కొద్ది తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఫలితాలపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ఫలితాలపై ఎక్స్ వేదికగా వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 2019 నాటి ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టారు. సోఫాలో అనారోగ్యంతో కుప్పకూలారంటూ వచ్చిన వార్తలకు సోఫాలోనే కూర్చుని కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..
ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. చంద్రబాబూ...! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది.ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి...నీ మీద జాలేస్తోంది!అంటూ ట్వీట్ చేశారు.
Here's YSRCP MP Tweet
చంద్రబాబూ...!
పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.
ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది.
ఈసారి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)