ఏపీలో కోవిడ్‌–19తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే కోవిడ్‌–19తో చాలా మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. ఇంకా మిగిలిపోయిన మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.10 కోట్లను విడుదల చేసింది. పరిహారం చెల్లించాక ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కలెక్టర్లకు సూచించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)