వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది.దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో ఇటీవల వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.
వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు
బ్రేకింగ్:వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వల్లభనేని వంశీ...
వంశీ ముందస్తు బెయిల్ కొట్టివేసిన హైకోర్టు.
ఇదే కేసులో గతంలో వంశీని అరెస్టు చేయొద్దు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన… pic.twitter.com/QZQwnUqIAp
— RTV (@RTVnewsnetwork) February 20, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)