కేవ‌లం రూ.10 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో మొద‌లైన ఓ మార్ట్ ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి ట‌ర్నోవ‌ర్ సాధించింది. ఈ ఘనత సాధించింది ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ఏర్పాటైన జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్. కడ‌ప జిల్లా ప‌రిధిలోని పులివెందుల‌లో 1,270 పొదుపు సంఘాలు ఉండ‌గా... వాటిలోని 10,200 మంది ఒక్కొక్క‌రు రూ.150 మేర పొదుపు చేసి రూ.10 ల‌క్ష‌ల‌ను స‌మ‌కూర్చారు‌. ఈ మొత్తంతో పులివెందుల‌లో జ‌గ‌న‌న్న మ‌హిళా మార్ట్ పేరిట ఓ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఏడాది తిరిగేలోగానే ఏకంగా రూ.1 కోటి టర్నోవ‌ర్‌ను సాధించింది. మొత్తం మ‌హిళ‌లలే నిర్వ‌హిస్తున్న ఈ మార్ట్ కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగానే రాణిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ మార్ట్ విజ‌య గాథ‌ను ప్ర‌స్తావిస్తూ ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ఓ వీడియోను శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)