ఆంద్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు డబ్బులు వెదజల్లుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దే ఓటుకు 2000-3000 ఇస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. కాకినాడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు పట్టపగలే డబ్బుల పంచుతున్న (MLC candidate distributing money) వీడియో వెలుగులోకి వచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు ఓటు వేస్తే 3000 అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అలాగే, మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు 3000 రూపాయలను ఓట్లరకు పంచుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్‌ఆర్ఓ, పోలీసులు చేరుకున్నారు.
MLC candidate distributing money in the Pithapuram constituency
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ప్రలోభాల పర్వం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలో డబ్బుల పంచుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి.
మున్సిపల్ కళ్యాణ మండపంలో ఓటర్ లిస్టులోని పేర్లు ఆధారంగా ఓటరుకు 3000 రూపాయలు అందజేస్తున్న వైనం.
పేరాబత్తుల రాజశేఖర్ తరపున సకుమళ్ళ గంగాధర్ డబ్బులు పంపిణి… pic.twitter.com/rw5E4Cnm84
— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)