ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా నాలుగో యేడాది కూడా జాతీయ అవార్డును దక్కించుకుంది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడుసార్లు అవార్డును దక్కించుకోగా, తాజాగా మరోమారు ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందుకున్నారు. ఆర్టీసీ నిర్వహణ, పరిపాలనలో డిజిటల్ సేవలను, విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సంస్థలకు ప్రతియేటా డిజిటల్ టెక్నాలజీ సభ ప్రతియేటా ఈ అవార్డులను ఇస్తుంది. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ తదితర అంశాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిజిటల్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ అవార్డు కోసం ప్రతి యేటా అనేక సంస్థలు పోటీపడుతుంటాయ. అయినప్పటికీ ఏపీఎస్‌ఆర్టీసీ వరుసగా నాలుగో యేడాది దక్కించుకోవడం గమనార్హం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)