గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని చెప్పారు. నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా... అందులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తుచేశారు.
టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం పట్టాభి రెచ్చగొట్టడమేనని వివరించారు. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారని వివరించారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పక్షపాతం చూపించలేదని, రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారని జగన్ తెలిపారు.అప్పట్లో చేసిన ఫిర్యాదులో వల్లభనేని వంశీ పేరులేదని గుర్తుచేశారు. వంశీని ఇరికించాలనే కుట్రతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసును రీఓపెన్ చేసి, వంశీని 71వ నిందితుడిగా చేర్చారని తెలిపారు.
ఇక ఇదే విషయంపై కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేష్ బెదిరించి అతని చేత కేసు రీ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పకోడి గాళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు. చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు.
Kodali Nani Clarity on Party Change Rumors
చచ్చేదాకా జగన్ వెంటే.... ఆ పకోడి గాళ్ళకు నేను భయపడను
- కొడాలి నాని 🔥🔥 pic.twitter.com/KbtroAxJ2L
— Rahul (@2024YCP) February 18, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)