ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. పలువురు పార్టీలను వదిలి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు.

 దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు.

My journey with YS Jagan: Mantralayam MLA Balanagi Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)