Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, మనం చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కుందామని తెలిపిన జగన్

నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం

Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, మనం చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కుందామని తెలిపిన జగన్
YS Jagan Mohan Reddy (Photo-YSRCP)

నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.

వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించండి, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

మనం యుద్ధం చేసేది చంద్రబాబుతో కాదు.. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము. ఆ మీడియా సామ్రాజాన్ని ఎదుర్కోవడానికి మనకి ఉన్న ఏకైక అస్త్రం సోషల్ మీడియా. నేను జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు నేను మీరు కలిసి ఎలా చేద్దాం అనేది మాట్లాడుదామని వైయస్ జగన్ అన్నారు.

YS jagan Slams Chandrababu

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 08, 2025 06:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).