చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గొల్లమడుగు మలపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సికింద్రాబాద్‌కు చెందిన లలిత (65), తమిళనాడులోని మణియంబాడికి చెందిన కుబేంద్రన్ (35) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సుల్లో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident (Photo-X)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)