ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. సాయంత్రం మిర్చీ కోత నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ముప్పాళ్ల మండలం బొల్లవరం అడ్డరోడ్డు వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తాపడింది.దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 30 మంది మహిళా కూలీలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
భూ తగాదాలు.. పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, సత్యసాయి జిల్లాలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో
Andhra Pradesh Road Accident:
పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి
ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది
దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు… pic.twitter.com/hgYJMXS5Rd
— Pulse News (@PulseNewsTelugu) February 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)