ఏపీలో వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసి చివరకు డబ్బు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. దీంతో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కట్టారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో.. ఫలితాలు వెల్లడైన రోజున ఊరు విడిచి వెళ్లి.. ఇక ఇంటికి తిరిగి రాలేదు.

బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందన లేదు. ఈ నెల 7న పందెం వేసిన వారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్టు తెలిసింది. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)