దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్దతుగా రామానాయుడు చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయనీయకుండా టీడీపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు.

తర్వాత పోలీసులు లాఠీచార్జ్ చేసి రామానాయుడిని స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో సోమవారం రాత్రి బస చేశారు. మరుసటి రోజు ఉదయం పెరుగులంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరుబయటే స్నానం చేశారు. దళితులతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకున్నారు. ఎన్ని రోజులైనా దళితులకు అండగా ఉంటానంటూ నిమ్మల రామానాయుడు ట్వీట్ చేశారు

Here's MLA Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)