కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. పథకం అమలులో అత్యుత్తమంగా రాణించిన ఏపీ ప్రభుత్వం 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో భాగంగా కేంద్రం అందించిన అవార్డుల గురించి ఆ శాఖ మంత్రి విడదల రజని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. ఏపీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మెరుగైన రీతిలో అమలు చేసిన తీరుకు గానూ ఈ అవార్డులు వచ్చినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఏకంగా 6 అవార్డులు వచ్చేలా పనిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Honoured to share that the State Medical & Health Dept. under the leadership of Hon'ble CM @ysjagan has received six awards for the best performance in implementation of the #ABDM. I Congratulate all the officers & the field medical staff who worked hard for this achievement. pic.twitter.com/BRu44T3x3h
— Rajini Vidadala (@VidadalaRajini) September 30, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)