ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు రాయలసీమ పర్యటనకు వచ్చారు. అన్నమయ్య జిల్లాలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం, ఆ తర్వాత కడప జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందులలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. పులివెందులలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన శిల్పారామాన్ని ప్రారంభించిన అనంతరం, శ్రీస్వామి నారాయణ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు.

ఈ పాఠశాలకు ఏపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమి కేటాయించగా... స్వామి నారాయణ్ సంస్థ రూ.60 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపడుతోంది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ఏపీ కార్ల్ వద్ద అగ్రికల్చర్, హార్టీకల్చర్ ల్యాబ్ ను ప్రారంభించారు. అంతేకాదు, పులివెందులలోని ఆదిత్య బిర్లా టెక్స్ టైల్ యూనిట్ ను కూడా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

AP CM YS Jagan Mohan Reddy Inaugurated Lord Krishna Temple in Pulivendula Watch Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)