పులివెందుల(Pulivendula) పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి కంటి ఆస్పత్రి(Rajareddy Eye Center)ని ప్రారంభించారు జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.

పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజారెడ్డి ఆస్పత్రి కొన్ని దశాబ్దాలుగా పులి వెందులలో సేవలు అందిస్తోంది.

విద్యార్థులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్, మే నెలలో తల్లికి వందనం, ఆ వెంటనే అన్నదాత పథకం అమలు చేస్తామని తెలిపిన కూటమి ప్రభుత్వం

తాజాగా ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించారు జగన్. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది.

 YS Jagan Inaugurates Rajareddy Eye Center

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)