తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదని, చంద్రబాబు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో కూడా తెలియదని అమర్నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు మాటలను పక్కనబెట్టి... కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తే... తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే ఆంధ్రాలో ఎన్నో ఎకరాలు కొనొచ్చంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం తాను కూడా చూశానని వెల్లడించారు.

అయితే, విశాఖలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చంటూ బదులిచ్చారు. తెలంగాణ సంగతి అటుంచితే... హైదరాబాద్ లోని భూముల ధరల కంటే ఎక్కువ ధరలు ఇవాళ విశాఖలో ఉన్నాయని అమర్నాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వంటి ఒక్క నగరాన్ని పట్టుకుని, తెలంగాణ అంతా ఏదో జరిగిపోతోందనే భావనను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఏపీలో విశాఖలోనే కాదు, విజయవాడలో, నర్సీపట్నంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ భూముల ధరలు భారీగానే ఉన్నాయని వివరించారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)