ఏపీఎస్ఆర్టీసీ తాజాగా డోర్ టు డోర్ సేవలు ప్రారంభించింది. ఆర్టీసీ కార్గోలో డోర్ టు డోర్ సేవలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్గో సర్వీసుకు ఆదరణ పెరిగిందని అన్నారు.

రేపు అర్ధరాత్రి నుంచి డోర్ టు డోర్ కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తొలి మూడు ఆర్డర్లకు కార్గో పికప్, డెలివరీ సేవలు ఉచితం అని వెల్లడించారు. తొలుత విజయవాడ-విశాఖ మధ్య ఉగాది నుంచి సేవలు అమల్లోకి వస్తాయని, ఆపై దశల వారీగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి విస్తరిస్తామని వివరించారు. ఆన్ లైన్ లేదా, యాప్ ద్వారా కార్గో సేవలు పొందవచ్చని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.

Here's APSRTC Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)