Palla Srinivasa Rao as TDP New Preident in AP: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును (Palla Srinivasa Rao) నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో నేడు పల్లా శ్రీనివాసరావు చంద్రబాబును కలిశారు. పల్లాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక నుండి ఎన్టీఆర్ భరోసాగా మారిన ఏపీ పెన్సన్ స్కీం పేరు, వచ్చే నెల నుంచి అర్హులైన వారికి రూ. 4 వేలు పెన్సన్
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లాను చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు వ్యవహరించిన విషయం తెలిసిందే
Here's News
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
Follow👉@bigtvtelugu for more updates#AndhraPradesh #APNews #Tdp #NarachandrababuNaidu #PallaSrinivasaRao #Newsupdates #bigtvlive @JaiTDP @ncbn @Pallasrinivas4u pic.twitter.com/AUtDanUPSO
— BIG TV Breaking News (@bigtvtelugu) June 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)