చంద్రబాబు కేసు వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ లూథ్రా ఎక్స్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇవాళ్టి నినాదం ఇదే అంటూ గురు గోబింద్ సింగ్ ప్రవచనాలను పంచుకున్నారు. అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే... ఇక చేతిలోకి కత్తి తీసుకుని శక్తి ఉన్నంతవరకు పోరాడడమే మార్గం" అని ఆ ప్రవచనాలలో గురు గోబింద్ పేర్కొన్నారు. నాడు ఔరంగజేబ్ ను ఉద్దేశించి గురు గోబింద్ సింగ్ రాసిన జాఫర్ నామాలో ఈ ప్రవచనాలు ఉన్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లూథ్రా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను లూథ్రా.. చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది.
Here's Tweet
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)