పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంలో నేను ప్రధాని మోదీకి ఒక్కటే చెప్పాను. అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి.. నిర్వాసితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేయండి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకు మంచి జరగాలని చెప్పాను. త్వరలోనే ఇవ్వాల్సినవన్నీ అందుతాయి. మీ బిడ్డ వల్ల ఏ ఒక్కరైనా నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదు. చేతనైతే మంచే చేస్తాడు.. చెడు మాత్రం చేయడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.

వరదల సమయంలో ఇక్కడకు వచ్చి అధికారులను చుట్టూ తిప్పుకుని ఫొటోలు తీసుకుని పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కాదు.. పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇది. అందుకే వరదలు తగ్గిన తర్వాత మీకు అందిన సాయం గురించి తెలుసుకోవడానికి వచ్చాను.ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్న తపన ఉన్న ప్రభుత్వం మనది. డబ్బులు మిగుల్చుకోవాలన్న ఆరాటం లేదు.. వరద బాధితులు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు.. సాయం అందకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు అన్నదే మన ప్రభుత్వ ఆరాటం: సీఎం వైయస్ జగన్

CM Jagan

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)