మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగనున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్లు కొన్నిసార్లు 110 కిలోమీటర్లు గాలులు వీస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.తీవ్ర తుఫాను Michaung ప్రభావం మరియు గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి మరియు అనేక చెట్లు నేలకూలాయి. వీడియో ఇదిగో..
Here's Videos
Severe Cyclonic Storm #Michaung effect and due to incessant rains for the past 2 days, the low-lying areas of the #Nellore city have been submerged and several trees uprooted.#Michaungcyclone #Cyclone #CycloneMichuang #CycloneMichaung #AndhraPradesh pic.twitter.com/YZXdaTCLDc
— Surya Reddy (@jsuryareddy) December 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)