శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైసీపీలో చేరారు. ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేశ్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్ నాథ్ తదితరులు కూడా పాల్గొన్నారు. భద్రయ్య, రాజేశ్ లకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 1985, 1994 ఎన్నికల్లో భద్రయ్య గెలుపొందారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా కూడా ఆయన ఆరేళ్ల పాటు పని చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)