హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొమరవోలు గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన ఆ గ్రామస్థులపై 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ కోప్పడినట్లుగా వీడియోలో తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. అయితే, నిమ్మకూరుకు వచ్చిన బాలకృష్ణను కలిసేందుకు ఆయన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు వచ్చారు.
నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు
ఈ సందర్భంగా గ్రామస్తులు.. బాలకృష్ణను పలకరించారు. ఫొటోలు సైతం దిగారు. అనంతరం, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కోరారు. అందుకు ఆయన ‘నేను పట్టించుకోను.. ఫొటోలు దిగారుగా వెళ్లండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా? అదెక్కడ ఉంది? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో, తన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలును బాలకృష్ణ విస్మరించడం, అసహనం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొమరవోలు గ్రామస్తులపై చిర్రుబుర్రులాడిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
నాతో ఫోటో దిగడమే మీకు అభివృధి
- కూటమి ఎమ్మెల్యే బాలకృష్ణ
కొమరవోలు గ్రామస్తులపై ఎమ్మెల్యే బాలయ్య ఆగ్రహం. మా గ్రామాన్ని పట్టించుకోరా.. అని బాలకృష్ణను ప్రశ్నించిన కొమరవోలు గ్రామస్తులు. పట్టించుకోను... ఫోటోలు దిగారుగా ఇక వెళ్ళండి అంటూ బాలకృష్ణ అసహనం#NandamuriBalakrishna #UANow pic.twitter.com/vy18KSXKd8
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 27, 2025
నందమూరి బాలకృష్ణ ఆగ్రహం..
నిమ్మకూరులో బాలకృష్ణతో ఫోటోలు దిగిన కొమరవోలు గ్రామస్తులు. మా గ్రామానికి కూడా రండి అంటుంటే.. పట్టించుకోను అంటూ బాలకృష్ణ అసహనం. కాగా, బాలకృష్ణ తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు. pic.twitter.com/fZRYgFnOID
— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)