ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు. కాగా, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. 1983 లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు.
Here's Videos
నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారితో సీఎం జగన్ గారు మరియు ఏపీ మంత్రుల ఫొటో సెషన్ pic.twitter.com/oH1VcMHgsm
— Dhanush Reddyv (@DhaneshwarPola) February 24, 2023
ఏపీ 24వ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం జగన్ గారు pic.twitter.com/W3jKrYMDcY
— Dhanush Reddyv (@DhaneshwarPola) February 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
