శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్‌ వద్ద స్టీరింగ్‌ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌, కండక్టర్‌ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

APSRTC bus overturns near Narasannapeta

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)