ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ను నియమించారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్ పూర్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. రాజశేఖర్ ఏయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

వీడియో ఇదిగో, జగన్ అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి, వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం

ఇక, కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సీఎస్సార్కే ప్రసాద్ ను నియమించారు. ప్రసాద్ ప్రస్తుతం వరంగల్ ఎన్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రసాద్ జేఎన్టీయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. యోగి వేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.ప్రకాశ్ బాబును నియమించారు. ప్రకాశ్ బాబు... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనిస్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ విభాగంలో బయోటెక్నాలజీ సీనియర్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ప్రకాశ్ బాబు యోగి వేమన వర్సిటీ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు వీసీల నియామకంపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

Prof GP Rajasekhar appointed as Andhra University Vice Chancellor

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)