జనసేకు గాజు గ్లాసును కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్‌(ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యూలర్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమహేంద్రవరానికి చెందిన ఎం శ్రీనివాస్‌ బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈసీ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారులు, హైదరాబాద్‌లోని జనసేన పార్టీ అధ్యక్ష/కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.గురువారం హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా తాను దరఖాస్తు చేశానని, తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిందని పిటిషనర్ తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)