దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు. అలాగే.. రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్‌ శ్రీ అబ్దుల్ నజీర్‌, సీఎం వైఎస్‌.జగన్‌ దంపతులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)