మార్చి 11, 2024, సోమవారం నాడు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నెలవంక కనిపించింది. దేశంలోని ముస్లింలు మార్చి 12 నుండి ఉపవాసం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్‌ మాసం ప్రారంభమైనట్లు మతపెద్దలు ప్రకటించారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీ సందడిగా మారింది. రంజాన్‌ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేస్తారని, ఇది ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని పేర్కొన్నారు. వేడుకలను సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని చెప్పారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)