ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. వైఎస్‌ఆర్‌ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు.శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్ఛాపురంలో ‘ప్రజా ప్రస్థానం’ విజయస్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

బీజేపీకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయి. మోదీ సర్కారుకు కీలుబొమ్మలా జగన్‌ ప్రభుత్వం మారింది. రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసింది. ఒక్క రోజు కూడా జగన్‌ ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? రాహుల్‌గాంధీ మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతానని చెప్పారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్‌. వైఎస్‌ఆర్‌ ఆశయాలను అందరం బతికిద్దాం’’ అని షర్మిల అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)