మార్గదర్శి కేసులో డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శిలో ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ప్రశ్నించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.బి.పర్డీవాలా ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఒక వైపు హెచ్‌యుఎఫ్, మరో వైపు ప్రొప్రైటరీ కన్సర్న్ అంటున్నారు.. డిపాజిట్లు బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిపాజిటర్లందరికీ చెల్లింపులు చేశామని మార్గదర్శి లాయర్ తెలపగా, చెల్లింపులు చేశాక వివరాలు బయటపెట్టడంలో అభ్యంతరం ఏంటని మాజీ ఎంపీ ఉండవల్లి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)