కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి పి గన్నవరం టికెట్‌ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్‌ గోబ్యాక్‌’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ టికెట్ మహాసేన రాజేష్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన శ్రేణులు పి.గన్నవరం నియోజకవర్గం కమిటీ సభ్యులు గంటి హరీష్ మాధుర్ మీద దాడి చేశారు. ఆయన కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)