విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కాసేపటి క్రితం స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు ? డీసీ కార్యాయలయం దాడిపై స్పందించిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్
స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తనకు 2 నెలలు సమయమివ్వాలని కోరారు.
Here's Video
"There is no question of privatisation of Vizag Steel Plant. Before I announce, the PM’s permission is required," said Union Steel Minister HD Kumaraswamy speaking to the media after he visited to Rashtriya Ispat Nigam Ltd (RINL), the corporate entity of VSP. pic.twitter.com/ypLOb5Dad2
— NewsMeter (@NewsMeter_In) July 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)