మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. పసల కృష్ణమూర్తి కుమార్తె పసల కృష్ణ భారతిని కలవడమే కాకుండా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు ఆమె సోదరి, మేనకోడలు వద్ద నుంచి కూడా మోదీ ఆశీర్వదాలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించిన పసల కృష్ణమూర్తి 1921లో తన సతీమణితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాది అయిన ఆయన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన 1978లో కన్నుమూశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)