ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం.. అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, ఎందుకో తెలుసా?
అంతర్జాతీయ గిరిజన దినోత్సవం (International Tribals Day) సందర్భంగా గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి లోకేష్ (Minister Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా శుభాకాంక్షలు (Congratulate) తెలియజేశారు.రాబోయే రోజుల్లో గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అందిస్తామని తెలియజేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
Here's Video
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన ముఖ్యమంత్రి.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/XEK06av0c8
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024
Here's CM Tweet
అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన సోదరులకు నా శుభాకాంక్షలు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి. అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు…
— N Chandrababu Naidu (@ncbn) August 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)