వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు స్పందించారు(YSRCP on Vamsi Arrest). ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా స్పందించారు. వంశీపై(Vallabhaneni Vamsi) అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్‌ ఉందని వెల్లడించారు.

గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై(TDP Office) దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్నా.. ఇటీవల ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. కానీ.. మళ్లీ వంశీని టార్గెట్ చేసి మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడతారా..చంద్రబాబు ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అని మండిపడింది వైసీపీ(YSRCP Twitter).

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే 

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన నివాసంలో వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు ఏపీ పోలీసులు. BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5), ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు పోలీసులు.

YCP Reacts on Vallabhaneni Vamsi Arrest

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)