ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి.ఈ పథక లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపుతో ఉన్న ఇతర కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద రూ.15 వేలతో పాటు విద్యార్థులకు బ్యాగు, బూట్లు, బెల్టు, సాక్సులు, పుస్తకాలు, యూనిఫాం ఇస్తారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త‌ల్లికి వందనం ప‌థ‌కం విధివిధానాలు ఖ‌రారు, ఆధార్ కార్డుతో పాటూ ఇవి ఉండాల్సిందే! పూర్తి వివ‌రాలిగో!

అయితే ఈ మార్గదర్శకాలపై ఎక్స్ వేదికగా వైసీపీ నేత వంగా గీత విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు ఎన్నికల హామీ వీడియోని షేర్ చేస్తూ చంద్రబాబు మార్క్ మోసపూరిత రాజకీయం కాదా ఇది? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15వేల ఆర్థిక సాయం ఇస్తానని చెప్పి ప్రజల ఓట్లు వేయించుకొని అందల మెక్కి.. నేడు తల్లికి 15 వేల చొప్పున 'తల్లికి వందనం' అని నీ మోసపూరిత రాజకీయాలను మరోసారి బయటపెట్టావ్ చంద్రబాబు! అంటూ విమర్శలు గుప్పించారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)